శ్రీరామ నీ నామమెంతో రుచిరా.. 

5 Feb, 2022 04:53 IST|Sakshi

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం భక్త రామదాసు 389వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం, చక్ర సిమెంట్స్, నేండ్రగంటి అలివేలు మంగ సర్వయ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో చిత్రకూట మండపంలో వివిధ నగరాల నుంచి వచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసులు రామయ్యతో పాటు భక్తరామదాసుకు నవరత్న ఘోష్టితో ‘స్వరార్చన’ జరిపారు.

తొలుత రామదాసు ప్రతిమతో భద్రగిరి ప్రదక్షిణ, నగర సంకీర్తన, రామదాసుకు అభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా మూడు రోజుల పాటు నిర్వహించే రామదాసు జయంతి ఉత్సవాలను కరోనా ఆంక్షల నేపథ్యాన ఈసారి ఒకేరోజుకు పరిమితం చేశారు.  

మరిన్ని వార్తలు