ఫంక్షన్‌ హాల్‌ వద్ద బైక్‌ దొంగలించి అతి వేగంగా వెళ్లడంతో...

8 May, 2022 15:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బీబీపేట (నిజామాబాద్‌): ద్విచక్ర వాహనం దొంగతనం చేసి తీసుకెళ్లే క్రమంలో వాహనాన్ని అతి వేగంగా నడుపుతూ అదుపు తప్పి కిందపడడంతో ఒకరు మృతి చెందిన సంఘటన శనివారం మాల్కాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై సాయికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన కమ్మరి రమేష్‌ (31) బీబీపేటకు చెందిన గడీల బాస్కర్‌కు చెందిన ద్విచక్ర వాహనాన్ని ఓ ఫంక్షన్‌ హాల్‌ వద్ద దొంగలించి అతి వేగంతో వెళ్తుండగా అదుపు తప్పి  రోడ్డుపై కింద పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లత ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు.  
చదవండి👉 లోపాల్లేవు, అకాల వర్షంతోనే అలా!

మరిన్ని వార్తలు