ఉత్సాహంగా బర్డ్‌ వాక్‌ ఫెస్టివల్‌

9 Jan, 2022 03:37 IST|Sakshi
కొమురంభీం జిల్లా పెంచికల్‌పేట అడవుల్లో బర్డ్‌ వాక్‌లో పాల్గొన్న సందర్శకులు  

పక్షులను చూసేందుకు వచ్చిన ఔత్సాహికులు

సాక్షి, మంచిర్యాల: బర్డ్‌ వాక్‌ ఫెస్టివల్‌కు విశేష స్పందన వచ్చింది. శనివారం తెల్లవారు జామున 5 గం. నుంచే అడవుల్లో సందర్శకుల సందడి మొదలైంది. పక్షులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు, వాటి కూతలు వినేందుకు వివిధ ప్రాంతాల నుంచి వంద మందికిపైగా పేర్లు నమోదు చేసుకోగా, అధికారులు కోవిడ్‌ కారణంగా 60 మందికే అనుమతి ఇచ్చారు. తొలి రోజు కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్, సిర్పూర్‌ టీ, బెజ్జూరు, పెంచికల్‌పేట అడవుల్లో బర్డ్‌ వాక్‌ కొనసా గింది.

హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, సిద్దిపేటతోపాటు ఇతర ప్రాంతాల పక్షి ప్రేమికులు అడవుల్లో కలియదిరిగారు. కెమెరాల్లో పక్షుల ఫొటోలను బంధించారు. ఆసిఫాబాద్‌ డీఎఫ్‌వో ఎస్‌.శాంతారామ్‌ మాట్లాడుతూ.. కరోనాతో అనేక మంది చాలా కాలం ఇంటికే పరిమితమయ్యారని అలాంటి వారు ప్రకృతితో గడిపేందుకు ఈ సందర్శన మంచి అవకాశమని అన్నారు. ఆదివారం కూడా ఈ ఫెస్టివల్‌ కొనసాగుతుంది.

మరిన్ని వార్తలు