‘నిథమ్‌’ క్యాంపస్‌ పక్షులకు నిలయం

4 Jul, 2021 08:16 IST|Sakshi
డెక్కన్‌ బర్డ్‌ వాచర్స్‌ సభ్యుల బృందం

పక్షులను గుర్తించేందుకు వచ్చిన డెక్కన్‌ బర్డ్‌ వాచర్స్‌ బృందం

రాయదుర్గం: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (నిథమ్‌) క్యాంపస్‌ అనేక రకాల పక్షి జాతులకు నిలయంగా మారింది. శనివారం డెక్కన్‌ బర్డ్‌ వాచర్స్‌ సభ్యుల బృందం గచ్చిబౌలిలోని క్యాంపస్‌ను సందర్శించింది. క్యాంపస్‌లోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి 40 రకాల పక్షి జాతులు, అనేక రకాల సీతాకోకచిలుక జాతులను గుర్తించారు. ముఖ్యంగా ఇండియన్‌ స్పాట్‌ బిల్డ్‌ డక్, రెడ్‌వాటెడ్‌ ల్యాప్‌వింగ్, కాపర్స్‌ మిత్‌బార్బెట్‌ వంటి అరుదైన పక్షులు ఉన్నాయి.

రెడ్‌ వాటెడ్‌ ల్యాప్‌వింగ్‌ పక్షి 

కాగా, సీతాకోక చిలుకల్లో సాధారణ చిరుత, సాదా పులిసీతాకోకచిలుక వంటివాటిని గుర్తించారు. డెక్కన్‌ బర్డర్స్‌ కార్యదర్శి సురేఖ మాట్లాడుతూ.. నిథమ్‌లోని పక్షుల ఫొటోలతో బర్డ్‌ ఆఫ్‌ నిథమ్‌ పేరిట ఓ మ్యాన్యువల్‌ను ప్రచురిస్తామని తెలిపారు. ఇక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి పరిచేలా చూస్తామని వివరించారు. అనంతరం వారిని నిథమ్‌ డైరెక్టర్‌ చిన్నంరెడ్డి, ప్రిన్సిపల్‌ నరేంద్రకుమార్‌ సన్మానించారు. బృందంలో సభ్యులు షఫతుల్లా, నంద్‌కుమార్, బిడిచౌదరి, శిల్కాచౌదరి, డాక్టర్‌ శామ్యూల్‌ సుకుమార్‌ ఉన్నారు.

ఇండియన్‌ స్పాట్‌ బిల్డ్‌ డక్‌ పక్షి 


కామన్‌ లియోపర్డ్‌ బటర్‌ఫ్లై 

మరిన్ని వార్తలు