క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు చేదు అనుభవం

7 Jul, 2021 11:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గచ్చిబౌలిలో క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఒలంపిక్స్‌కు వెళ్తున్న బ్యాడ్మింటన్‌ ప్లేయర్ల కోచ్‌ల సన్మాన కార్యక్రమంలో మంత్రి షాక్‌ తిన్నారు. కోవిడ్‌ టైంలో గుంపులుగా సత్కారాలు పెట్టడంపై కోచ్‌ల అసహనం వ్యక్తం చేశారు. సన్మానం కోసం ఒలంపియన్‌ కోచ్‌లు స్టేజ్‌ మీదకి వచ్చేందుకు ఒప్పుకోలేదు. చివరకు మంత్రి బ్రతిమిలాడగా పీవీ సింధు, సాయి ప్రణీత్‌ స్టేజ్‌ మీదకు వచ్చారు.

మరిన్ని వార్తలు