ఎఫ్‌బీలో స‌త్తి ‘గరం గరం’ ముచ్చ‌ట్లు

1 Aug, 2020 17:32 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్ : త‌న మాట‌, భాష, యాస‌తో ప్రేక్ష‌కుల చేత చ‌ప్ప‌ట్లు కొట్టించుకున్న బిత్తిరి స‌త్తి గురించి తెలియ‌ని వారుండ‌రు. రంగు రంగుల పూల చొక్కాతో త‌నదైన హావభావాల‌తో అంద‌రిని అల‌రిస్తుంటాడు. మ‌రి అలాంటి సత్తి ‘సాక్షి’ టీవీలో గరం గరం వార్తలతో మన ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌ వేదిక‌గా లైవ్‌లో ముచ్చ‌టించ‌నున్నాడు. ఆదివారం (ఆగ‌స్ట్ 2) సాయంత్రం 5 గంట‌ల‌కు ‘సాక్షి’ ఫేస్‌బుక్ ద్వారా లైవ్‌లో త‌న మాట‌ల‌ను మ‌న‌తో షేర్ చేసుకోబోతున్నాడు. ఇంకెందుకు ఆల‌స్యం చూసి ఆనందించండి. (బిత్తిరి సత్తితో ‘గరం గరం వార్తలు’.. రేపే ప్రారంభం)

కాగా, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిత్తిరి సత్తి ‘గరం గరం వార్తలు’ ప్రోగ్రాం ఆదివారం ప్రారంభం కానుంది. సాక్షి టీవీలో ప్రతిరోజూ రాత్రి 8.30 గంటలకు తిరిగి ఉదయం మళ్లీ అదే సమయానికి ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రొమోలకు వీక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సీనియర్‌ నటుడు, రచయిత తనికెళ్ల భరణితో సత్తి జరిపిన సంభాషణకు సంబంధించిన తాజా ప్రొమో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ‘గరం గరం వార్తలు’ కోసం వీక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ఈ స్పందనను బట్టి అర్థమవుతోంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా