బీజేపీ ‘బడి బాట’..!

17 Jun, 2022 01:15 IST|Sakshi

పాఠశాలల స్థితిగతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన

సర్కార్‌ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులపై పరిశీలన జరిపి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు బీజేపీ బడిబాట పట్టనుంది. రాష్ట్రంలో విద్యాసంవ త్సరం మొదలు కావడంతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘మన ఊరు– మన బడి’ సాగు తున్న నేపథ్యంలో బీజేపీ కార్యక్రమానికి రాజ కీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నెల 25వ తేదీలోగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మొదలు అన్నిస్థాయిల నేతలు కనీసం ఒక ప్రభుత్వబడిని సందర్శించి, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు ఏ మేరకు అందు బాటులో ఉన్నాయో పరిశీలించనున్నారు.

విద్యార్థి, యువజన సంఘాలు పాల్గొనేలా..
రాష్ట్ర నాయకులతోపాటు యువజన, విద్యార్థి, ఇతర అనుబంధ సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా బడిబాటను రూపొందించారు. పాఠశాలల సందర్శన సందర్భంగా దృష్టికి వచ్చిన సమస్యలు, అంశాలను వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను సంబంధిత అధి కారుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారా నికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 

సర్కార్‌ వైఫల్యాలను ఎండగట్టేందుకు...
గత 8 ఏళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో విద్యారంగం తీరు, ముఖ్యంగా పాఠశాల విద్య తీరు ఎలా ఉందనే అంశంపై దృష్టి సారించి వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయకపోవడం మొదలుకుని పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ అందుబాటులోకి తీసుకురాకపోవడం వంటి అంశాలను ప్రముఖంగా ప్రస్తావించేలా క్షేత్రస్థాయి నుంచి వివరాలను సేకరించనుంది. ఈ ఏడాది నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతున్నా అనేకచోట్ల ఆంగ్లం బోధించే ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటం వంటి అంశాలపై పార్టీ నేతలు దృష్టి పెడుతున్నారు.

మన ఊరు– మన బడి కార్యక్రమానికి కూడా కేంద్రమే అధికశాతం నిధులు కేటాయిస్తున్న విషయాన్ని ప్రజ లకు వివరించడం ద్వారా రాష్ట్రం లోని అన్ని ప్రతిష్టాత్మక పథకా లకు కేంద్రమే నిధులు విడుదల చేస్తున్నా వాటిని రాష్ట్ర సర్కారు ఇతర రంగాలకు మళ్లిస్తోందని, పేర్లు మార్చి తన పథకాలుగా ప్రచారం చేసుకుంటోందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. పార్టీపరంగా చేపడుతున్న ‘బడిబాట’ లో వెల్లడయ్యే సమస్యల ప్రాతిపదికన రాష్ట్ర స్థాయిలో ఉద్యమ కార్యాచరణను చేపట్టాలనే ఆలోచనతో పార్టీనాయకత్వం ఉంది.  

మరిన్ని వార్తలు