రేపట్నుంచి కిషన్‌రెడ్డి ‘జన ఆశీర్వాద యాత్ర’ 

18 Aug, 2021 08:48 IST|Sakshi

బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈ నెల 19, 20, 21 తేదీల్లో ‘జన ఆశీర్వాద యాత్ర’ చేపడుతున్నారని బీజేపీ ప్రధాన కార్యదర్శి, పాదయాత్ర ఇన్‌చార్జి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. మోదీ ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల ఆశీర్వాదాలను తీసుకునేందుకు ఈ యాత్ర చేపడుతున్నామన్నారు. మంగళవారం ఆయన  మీడియాతో మాట్లాడారు.

బుధవారం రాత్రి కిషన్‌రెడ్డి తిరుమల చేరుకుని గురువారం ఉదయం వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుని కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని తెలిపారు. గురువారం సాయంత్రం 4 గంటలకు కోదాడ తిరుమలాపురం చేరుకుంటారని చెప్పారు. యాత్ర 12 జిల్లాలు, 7 లోక్‌సభ, 18 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 384 కి.మీ. మేర సాగుతుందన్నారు. 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు