గంగుల ఇంటిపై ఈడీ దాడులు: మంత్రి రూ.749 కోట్ల పెనాల్టీ కట్టాలన్న బీజేపీ లాయర్‌ మహేందర్‌ రెడ్డి

9 Nov, 2022 16:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇన్‌కమ్‌టాక్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి ఫిర్యాదు చేసింది తానేనని బీజేపీ లాయర్‌ మహేందర్‌రెడ్డి చెప్పారు. గతంలో బీజేపీ కరీంనగర్‌ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, ప్రస్తుతం జిల్లా కోర్టులో లాయర్‌గా పనిచేస్తున్నారు.

మంత్రి గంగుల కమలాకర్‌ ఇంట్లో ఈడీ, ఐటీ దాడులపై మహేందర్‌ రెడ్డి స్పందిస్తూ.. 'మైనింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని నేనే ఫిర్యాదు చేశా. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి వెళ్లి 2020లో కంప్లైంట్‌ ఇచ్చాను. 2021లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని షిప్పింగ్‌ కార్పోరేషన్‌ చెన్నైని ఈడీ సూచించింది. పది రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని సూచించినా.. ఇంతవరకు ఇవ్వలేదు. మీడియా ద్వారా ఈడీ దర్యాప్తు జరుగుతోందని తెలిసింది. దాదాపు రూ.749 కోట్ల పెనాల్టీ (వడ్డీతో కలిపి) మైనింగ్‌ చేస్తున్న వారు కట్టాల్సి ఉంది' అని తెలిపారు.

చదవండి: (మంత్రి గంగుల కమలాకర్‌ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు)

మరిన్ని వార్తలు