బీజేపీ నేత వివాహేతర సంబంధం.. కూతురిని అప్పగించాలంటూ..

13 Oct, 2021 12:53 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్‌లో బీజేపీ నేత వివాహేతర సంబంధం తాజాగా వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా బీజేపీ కార్పొరేటర్‌ భర్త తమ కూతురికి మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నాడని ఓ యువతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మంగళవారం రాత్రి కూడా తమ అమ్మాయిని ఎత్తుకెళ్లారని.. తమ కూతురిని తిరిగి తమకు అప్పగించి న్యాయం చేయాలంటూ వినాయకనగర్‌లోని బీజేపీ కార్పొరేటర్ ఇంటి ముందు బాధిత యువతి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కాగా, గతంలో అనేకసార్లు మందలించినా తీరు మారలేదని కార్పొరేటర్‌ దంపతులతో అమ్మాయి తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు.

చదవండి: (నీట్‌ రద్దు: మంత్రి కేటీఆర్‌తో డీఎంకే ఎంపీల భేటీ) 

మరిన్ని వార్తలు