ఏ ఒక్క రైతుకు కొత్తచట్టం వల్ల నష్టం జరగదు

14 Dec, 2020 15:30 IST|Sakshi

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

సాక్షి, మహబూబ్‌ నగర్‌ : దేశంలో అభివృద్ది, సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోదీ సంస్కరణలు తెచ్చారని, దేశంలో ప్రతిపక్షాలు, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ మద్దతు ధరకు ఢోకా లేదు. ఏ ఒక్క రైతుకు కొత్తచట్టం వల్ల నష్టం జరగదు. దళారులే చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల జరిగిన బంద్‌లో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తప్ప రైతులు పాల్గొన లేదు. రైతులు తమ ధాన్యం ఎక్కడైన అమ్ముకునే అవకాశం కల్పిస్తే రాజకీయపార్టీలకు ఎందుకు అభ్యంతరం. ( టీపీసీసీ చీఫ్‌ ఎంపిక మరింత ఆలస్యం!)

రైతులకు సన్న వరి ధాన్యం సాగుచేయమని చెప్పిన సీఎం కేసీఆర్‌ వాటిని ఎందుకు కొనుగోలు చేయటం లేదు?. ఎన్నికలు వచ్చినప్పుడే సీఎంకు రైతులు గుర్తుకు వస్తారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతులకు ఇంకా మేలు చేసే అవకాశం ఉంటే సూచనలు, సలహాలు ఇవ్వాలి. సన్న వరి ధాన్యం క్వింటాలు 2500 రూపాయాలకు వెంటనే కొనుగోలు చేయాలి. లక్ష రూపాయల రుణమాఫీ చేయాలి. ప్రధాని ఫసల్ భీమా యోజన రాష్ట్ర రైతులకు అమలు చేయాల’’ని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు