దుబ్బాక ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు నాంది

30 Oct, 2020 13:50 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు నాంది పలికే ఎన్నికలు కావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మిరదొడ్డి మండలం భూపల్లిలో  కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి  శుక్రవారం ఎన్నికల సభలో మాట్లాడుతూ, తెలంగాణా పోరాటంలో దుబ్బాక కీలకపాత్ర పోషించిందని అన్నారు. తెలంగాణా వస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని ధ్వజమెత్తారు. వేయి మంది కేసీఆర్‌లు ఉన్నా తెలంగాణ వచ్చేది కాదని, ఆనాడు పార్లమెంట్‌లో బిల్లు పెట్టినప్పుడు బీజేపీ మద్దతు తెలపడం ద్వారానే  వచ్చిందన్నారు. 

తెలంగాణ వచ్చిన   యువకులకు ఉద్యోగాలు లేకుండాపోయాయన్నారు. కేసీఆర్‌  ఇచ్చిన అన్ని హామీలను తప్పారని, టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌ కుటుంబానికి బుద్ధి చెప్పే అవకాశం దుబ్బాక ఉప ఎన్నిక ద్వారా వచ్చిందన్నారు. పంటల బీమా పథకం నరేంద్ర మోదీ తెచ్చారని,దీనిని తెలంగాణా ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదన్నారు కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. హరీష్ రావు అన్నీ అబద్దాలాడుతున్నారని ,రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలలో  కేంద్రం ఇస్తున్న నిధులు ఏమి లేవనడాన్ని ప్రశ్నించండి అని కోరారు. 

కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భవ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే మోదీకి,కేంద్ర ప్రభుత్వానికి పేరొస్తుందని దానిని నీరుగార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ కనుసన్నలో నడుస్తోందని, అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు అని  కోరారు. అట్లా వేస్తే టీఆర్‌ఎస్‌కు ఓటు వేసినట్లే అని అన్నారు. తెలంగాణాలో కుటుంబ పాలన నడుస్తుందని,అవినీతి పాలన నడుస్తుందని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ ఎంఐఎంను పెంచిపోషిస్తుందన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావును మిగతా పార్టీల అభ్యర్థులను చూడండి అని విజ్ఞప్తి చేశారు. రఘునందన్‌రావు ఒక ప్రశ్నించే గొంతుగా అసెంబ్లీలో ఉండాలంటే భారీ మెజార్టీతో గెలిపించండి అని కోరారు.

ఇక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ, దుబ్బాక లో జరిగేది ఎన్నికలు కాదని ఒక యుద్ధం అని అన్నారు.  రఘునందన్ రావుపై ఎన్ని కుట్రలు చేశారో అందరికి తెలుసు అని చెప్పారు. కేంద్రం నుంచి రూపాయి రాకుంటే  మీరు చెప్పిన మాటపై నిలబడే వారైతే తాము ఎక్కడికి రావాలో చెప్పాలన్నారు. తండ్రి, కొడుకు, అల్లుడు తెలంగాణను నాశనం చేస్తున్నారన్నారని నిప్పులు చెరిగారు. బంగారు తెలంగాణ కాలేదు కానీ మత్తు తెలంగాణ అయింద్యని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం ఎంతో మంది యువకులు ప్రాణాలు త్యాగం చేశారని, తనకు తోడుగా రఘునందన్ ను అసెంబ్లీకి పంపిస్తే టీఆర్‌ఎస్‌నఆడుకుంటామని, తామిద్దరం కలిసి తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం అని అన్నారు. 

చదవండి:దుబ్బాక ఎన్నికలపై కేంద్రానికి భువనగరి ఎంపీ లేఖ 

>
మరిన్ని వార్తలు