బీసీలను సీఎం కేసీఆర్ అణచి వేస్తున్నారు: లక్ష్మణ్‌

24 Jul, 2021 17:24 IST|Sakshi

బీసీలకు న్యాయం చేసింది కేవలం ప్రధాని మోదీనే

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్‌

సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్, కమ్యూనిస్టులు 70 ఏళ్లుగా బీసీలను అణచివేశారంటూ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, మోదీ తన కేబినెట్‌లో 27 మంది బీసీలను మంత్రులుగా నియమించారని, ఓబీసీ జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించారని పేర్కొన్నారు. ఓబీసీ కులాల వర్గీకరణకు కమిషన్ వేశారని, బీసీలకు న్యాయం చేసింది కేవలం ప్రధాని మోదీనేనని తెలిపారు.

బీసీలను సీఎం కేసీఆర్ అణచి వేస్తున్నారని లక్ష్మణ్‌ ఆరోపించారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటును పరిశీలిస్తున్నామని వెల్లడించారు. చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్లపై అన్ని పార్టీలు తీర్మానం చేయాలన్నారు. కులాలవారి బీసీ జనాభా లెక్కల సేకరణకు మేం వ్యతిరేకం కాదని, 33 లక్షల కులాలు ఉన్నాయని యూపీఏ సర్కార్‌ పక్కదారి పట్టించిందని లక్ష్మణ్‌ మండిపడ్డారు.

మరిన్ని వార్తలు