Koti ENT Hospital: బ్లాక్‌ ఫంగస్‌కు మెరుగైన చికిత్స

20 May, 2021 06:43 IST|Sakshi

సుల్తాన్‌బజార్‌: బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో మెరుగైన చికిత్సలు అందిస్తున్నామని, రోగుల నిష్పత్తికి అనుగుణంగా పడకల సంఖ్య పెంచుతామని, బ్లాక్‌ ఫంగస్‌ నోడల్‌ అధికారి, కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ టి.శంకర్‌ తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ను ఎదుర్కోవడానికి తాము సన్నద్ధంగా ఉన్నామని ‘సాక్షి’ తో తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 

బ్లాక్‌ ఫంగస్‌ లక్షాణాలు 
కన్ను పైభాగంలో వాపు ఏర్పడుతుంది. ముక్కు లోపల వాపు ఉంటుంది. తలనొప్పి,  చీది నప్పుడు బ్లాక్‌ స్పాట్‌ లాంటివి కనిపిస్తాయి. అలాంటి వారు అలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. 

బ్లాక్‌ ఫంగస్‌ ఎవరిలో వస్తుందంటే.. 
కోవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటే ఈ ఫంగస్‌ వచ్చే ఆస్కారం ఎక్కువ. కోవిడ్‌ చికిత్సల్లో స్టెరాయిడ్స్‌ ఎక్కువగా వినియోగిస్తుండడం వల్ల కోలుకున్న వారిలో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు వస్తున్నాయి. 

ఓపీలో పేర్లు నమోదు చేసుకుంటే చికిత్స అందిస్తాం 
చికిత్స కోసం కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రికి వచ్చే వారు ఎలాంటి  రిపోర్ట్‌లు తీసుకురావాల్సిన అవసరం లేదు. నేరుగా ఓపిలో తమ పేర్లు నమోదు చేసుకుంటే చికిత్స ప్రారంభిస్తాం. బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారికి కోవిడ్‌ పాజిటివ్‌ ఉంటే ఇతర రోగులకు అంటుకునే ప్రమాదం ఉంది. అలాంటి వారు గాంధీ ఆసుపత్రిలో చికిత్సలు తీసుకోవాలి. బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారిలో కోవిడ్‌ నెగిటివ్‌ ఉంటేనే ఇక్కడ  చికిత్సలు అందిస్తున్నాం.  

అందుబాటులో 50 బెడ్స్‌ 
ప్రస్తుతం  ఆస్పత్రిలో 30 నుంచి 50 బెడ్లను అందుబాటులోకి తీసుకువచ్చాం. కేసులు పెరిగితే 200 బెడ్స్‌ వరకు సమకూర్చే అవకాశం ఉంది.  ప్రస్తుతం 51 మంది ఇన్‌పెషెంట్లు ఉన్నారు వారికి సరిపడా మందులు, యాంపోటెరిసిన్‌–బి ఇన్‌జెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఏడు రోజుల పాటు చికిత్సలు అందజేస్తున్నాం.ఇప్పటి వరకు కొన్ని కారాణాల వల్ల ఒకరు మృతి చెందారు. యాంపోటెరిసిన్‌–బి ఇన్‌జెక్షన్ల కోసం ప్రభుత్వం అన్‌లైన్‌ ద్వారా అప్‌లైయ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అన్‌లైన్‌ ద్వారా అప్‌లైయ్‌ చేసుకున్న వారికి ఇన్‌జెక్షన్‌ ఇచ్చే సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తోంది. త్వరలోనే వెబ్‌సైట్‌ వివరాలు తెలియజేస్తాం.
చదవండి: కరోనా వ్యాక్సిన్‌: కోటి డోసులు కావాలి

మరిన్ని వార్తలు