హెడ్‌మాస్టర్ గది ముందు క్షుద్రపూజలు.. భయాందోళనలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

2 Aug, 2022 11:51 IST|Sakshi

డిండి (నల్గొండ): మండల పరిధిలోని టి.గౌరారం స్జేజి వద్ద ఉన్న దొంతినేని హన్మంతురావు ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తులు వరుసగా చేస్తున్న క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. పాఠశాల ప్రధానోపధ్యాయుడు పంతులాల్‌ తెలిపిన వివరాల ప్రకారం..  శనివారం సాయంత్రం పాఠశాల సమయం ముగిసిన తర్వాత తాళం వేసి ఉన్న పాఠశాలకు ఆదివారం సెలవు దినం కావడంతో అటువైపుగా ఎవరూ వెళ్లలేదు. గుర్తు తెలియని వ్యక్తులు హెచ్‌ఎం గది ఎదురుగా  కుంకుమ,పసుపు, నిమ్మకాయలంతో చేసిన క్షుద్ర పూజలు సోమవారం పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులు, విధ్యార్థులకు కనిపించడంతో  భయాందోళనకు గురయ్యారు.

ఈ విషయాన్ని వెంటనే  ఎంఈఓ సామ్యనాయక్‌  దృష్టికి తీసుకెళ్లినట్లు పంతులాల్‌ తెలిపారు. అదేవిధంగా గతంలో కూడా ఇలాంటి క్షుద్ర పూజలు చేసిన విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు,పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని  వాపోయారు. పాఠశాల ఆవరణలో ఏమైనా ని«ధులు ఉన్నాయా లేక ఉపాధ్యాయులు, విధ్యార్థులను భయపెట్టడానికి ఆకతాయిలు చేస్తున్న పనినా అని పలువురు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని ఆకతాయిలు పాఠశాలలో  చేస్తున్న క్షుద్రపూజలపై విచారణ చేపట్టామని  ఎస్‌ఐ.సరేష్‌ తెలిపారు.
చదవండి: సమాచారం ఇచ్చి మరీ.. స్వాతి మీ చెల్లెను చంపేశాను

మరిన్ని వార్తలు