TSPSC: పరీక్షల కంట్రోలర్‌గా బీఎం సంతోష్‌ నియామకం

21 Apr, 2023 21:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో టీఎస్‌పీఎస్పీలో పేపర్‌ లీక్‌ల వ్యవహారంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీంతో, తెలంగాణ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కీలక నిర్ణయం తీసుకుంది. 

తాజాగా కమిషన్‌లో పది కొత్త పోస్టులను మంజూరు చేసింది. పరీక్షల కంట్రోలర్‌, డిప్యూటీ కంట్రోలర్‌, అసిస్టెంట్‌ కంట్రోలర్‌, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌, చీఫ్‌ ఇన్మర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, సీనియర్‌, జూనియర్‌ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్‌, సీనియర్‌, జూనియర్‌ ప్రోగ్రామర్‌ పోస్టులు, జూనియర్‌ సివిల్‌ జడ్జి కేడర్‌లో లా ఆఫీసర్‌ పోస్టులకు కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలుపింది. అలాగే, కొత్త పోస్టులను మంజూరు చేసింది.

పరీక్షల కంట్రోలర్‌గా బీఎం సంతోష్‌
ఇదే సమయంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌ బాధ్యతలను నిర్వరిస్తున్న బి.ఎం.సంతోష్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. టీఎస్‌పీఎస్సీ అదనపు కార్యదర్శిగా ఐఏఎస్‌ అధికారి బి.ఎం.సంతోష్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, సంతోష్‌ టీఎస్‌పీఎస్సీ పరీక్షల కంట్రోలర్‌గా వ్యవహరించనున్నారు.
 

మరిన్ని వార్తలు