Boanlu 2021: అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన మంత్రి తలసాని

25 Jul, 2021 11:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. కరోనా ఆంక్షలు ఉన్నా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో  కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని అధికారుల సూచించారు.కాగా అమ్మవారికి ఆలయ కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. కాగా  ఆలయ పరిసరాల్లో 200 సీసీ కెమెరాల తో నిఘా ఏర్పాటు చేసిన అధికారులు 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. 

►ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బోనాల ఏర్పాట్లను సీపీ పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


►కాగా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా నేడు, రేపు ఆలయం సమీపంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు 25వ తేదీ తెల్లవారు జాము 4 గంటల నుంచి పూజలు పూర్తయ్యే వరకు, మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. 

మరిన్ని వార్తలు