హైదరాబాద్‌ అంతా ఒకే రోజు బోనాల ఉత్సవం

1 Aug, 2021 07:31 IST|Sakshi
శనివారం రాత్రి విద్యుద్దీపాల కాంతుల్లో లాల్‌దర్వాజ మహంకాళి ఆలయం

వచ్చే ఆదివారం అమావాస్య కావడంతోనే  

నేడు తొలిసారిగా అన్నిచోట్లా వేడుకలు 

సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్‌): భాగ్యనగరమంతా ఆదివారం బోనమెత్తనుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని అమ్మవారి ఆలయాలను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. సాధారణంగా గోల్కొండ, సికింద్రాబాద్‌ బోనాల అనంతరం పాతబస్తీతో పాటు కొన్ని చోట్ల బోనాలు నిర్వహిస్తారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లో చాలా వరకు శ్రావణమాసంలో బోనాల వేడుకలు జరుగుతాయి. పైగా ఒక్కో ఆదివారం ఒక్కో ప్రాంతంలో వేడుకలను నిర్వహిస్తారు. కానీ ఈ ఆదివారం మొదటిసారి హైదరాబాద్‌ అంతా ఒకే రోజు బోనాల ఉత్సవం నిర్వహించడం గమనార్హం. లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి జాతరతో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో అన్ని చోట్లా వేడుకలు జరగనున్నాయి.

బోనాల ఉత్సవాలకు పాతబస్తీలో నాటుకోళ్ల విక్రయాలు
ఎందుకంటే.. 
ఆషాఢమాసం బోనాల అనంతరం శ్రావణమాసంలో వచ్చే మొదటి ఆదివారం నగరంలోని మిగతా చోట్ల పండుగ చేస్తారు. పైగా ఒక్కో ఆదివారం ఒక్కో ప్రాంతంలో స్థానిక నమ్మకాలకు అనుగుణంగా ఈ వేడుకలు ఉంటాయి. కానీ శ్రావణమాసంలో వచ్చే ఆదివారం ఆగస్టు 8న అమావాస్య, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో ముందస్తుగానే బోనాల పండగ నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు