వరంగల్‌లో విషాదం.. బాలుడిని చంపేసిన ‘చాక్లెట్‌’

27 Nov, 2022 10:58 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ జిల్లా: చాక్లెట్‌ గొంతులో ఇరుక్కుని వరంగల్‌ జిల్లాలో ఓ బాలుడు మరణించాడు. కంగర్‌సింగ్‌ తన ఎనిమిదేళ్ల కుమారుడు సందీప్‌ను స్కూల్‌ దగ్గర దించి.. ఇటీవలే విదేశాల నుంచి తీసుకొచ్చిన చాక్లెట్‌ ఇచ్చాడు. సందీప్‌ చాక్లెట్‌ తీసుకుని పాఠశాల మొదటి అంతస్తులోని తన తరగతి గదికి వెళ్లాడు. చాక్లెట్‌ తింటూ క్లాస్‌రూమ్‌లోనే సృహ తప్పి పడిపోయాడు.

వెంటనే పాఠశాల యాజమాన్యం తండ్రికి సమాచారం అందించడంతో కంగర్‌ సింగ్‌ స్కూల్‌కు చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న సందీప్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేదు. ఊపిరి అందక సందీప్‌ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన కంగర్‌సింగ్‌ వరంగల్‌లో స్థిరపడ్డారు. ఎలక్ట్రికల్‌ షాపును ఆయన నిర్వహిస్తున్నారు.
చదవండి: క్యాన్సర్‌ను నివారించేందుకు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందా? ఎవరికి మేలు.. 

మరిన్ని వార్తలు