దారుణం: కళ్ల ముందే మునిగిపోయాడు!

6 Apr, 2021 20:48 IST|Sakshi

మేళ్లచెరువు (నల్గొండ): ప్రమాదవశాత్తు సున్నపురాయి క్వారీ నీటికుంటలో పడి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం మండలంలోని రామాపురం పరిధిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మండలంలోని రామపురం గ్రామానికి చెందిన ఉండేటి కొండలు కుమారుడు ఉండేటి  వెంకటేష్‌ (15) సోమవారం ఉదయం తన స్నేహితులు నలుగురితో కలిసి క్వారీ వైపు బహిర్భూమికి వెళ్లారు.

అదే సమయంలో వెంకటేష్‌ క్వారీలోకి దిగి కాళ్లు కడుక్కుంటుండగా కాలు జారి నీటిలో పడిపోయాడు. మునిగిపోతున్న వెంకటేష్‌ను చూసిన అతని స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ లోపు గ్రామస్తులు, కుంటుంబ సభ్యులు క్వారీ వద్దకు చేరుకొని వెంకటేష్‌ ఆచూకీ కోసం గాలించారు. క్వారీలో నీరు సుమారు 30అడుగుల లోతు ఉండడంతో మూడు గంటలపాటు గాలించి బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు.

దీంతో  సున్నపురాయి క్వారీ లోతుగా ఉండడంతోపాటు దానికి రక్షణ ఏర్పాటు చేయకపోవడం వలన తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుడి తండ్రి కొండలు, బంధువులు స్థానిక భీమా సిమెంట్‌ గేటు వద్ద ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ.నరేష్‌ సంఘటనా స్థలాకి చేరుకుని పరిశీలించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు