భళా వెంకటవర్షిత్‌: కాగితంతో బొమ్మలు తయారీ

4 Oct, 2021 08:04 IST|Sakshi

వాహనాలు, వివిధ సెట్టింగులు తయారీ

 శేభాష్‌ అనిపించుకుంటున్న ఏడో తరగతి విద్యార్థి

సమయం దొరికితే చాలు బొమ్మలు తయారీ

చెన్నూర్‌: చిన్నారి కళా..భళాగా ఉంది. ఖాళీగా ఉంటే చాలు వివిధ రకాల కళాకృతులు తయారు చేస్తాడు. న్యూస్‌ పేపర్లు ఉంటే చాలు వాటితో ఏదైనా ఇట్టే తయారు చేయడంలో దిట్టా. న్యూస్‌ పేపర్లలో వివిధ రకాలు వాహనాలు, సెట్టింగ్‌లను తయారు చేసి అందరితో  శేభాష్‌ అనిపించుకుంటున్నాడు. చెన్నూర్‌ పట్టణానికి చెందిన రెడ్డి మహేశ్, దీప్తి దంపతుల ప్రథమ కుమారుడు వెంకటవర్షిత్‌ కోటపల్లి మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి కొత్త ఆలోచనలతో వివిధ రకాల వస్తువులను తయారు చేయడంపై మక్కువ పెంచుకున్నాడు. కుమారుడిలోని సృజనాత్మకతను గమనించిన తండ్రి మహేశ్‌ ప్రొత్సహించాడు. తండ్రి ప్రొత్సహంతో వెంకటవర్షిత్‌ ముందుకు సాగుతున్నాడు.

ఖాళీ సమయం సద్వినియోగం
కరోనాతో ఏడాదిన్నర కాలంగా పాఠశాలలో ప్రతేక్ష బోధన నిలిచిపోయింది. దీంతో ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఖాళీ సమయంలో పనికి రాని న్యూస్‌ పేపర్లు, రంగుపేపర్లతో వివిధ రకాల బొమ్మలను తయారు చేయడం ప్రారంభించాడు వెంకటవర్షిత్‌. చిన్న చిన్న బొమ్మలను తయారు చేసిన చిన్నారి ఏకంగా వివిధ మోడళ్లలో వచ్చి మోటార్‌ సైకిళ్లతో పాటు వివిధ రకాల సెట్టింగ్‌లను తయారు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు.

రానున్న రోజుల్లో మరిన్ని రకాలు..
న్యూస్‌ పేపర్లతో ప్రస్తుతానికి మోటార్‌ సైకిళ్లలో పాటు వివిధ రకాల వస్తువులను తయారు చేశా. కరోనా సమయంలో ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న. ఎన్నో రకాల బొమ్మలను తయారు చేశా. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త వాహనాలతో పాటు దేవుని, జాతీయ నాయకులు బొమ్మలను తయారు చేస్తానని వెంకటవర్షిత్‌ తెలిపారు. పాఠశాలలు ప్రారంభమయ్యాయి. సెలవు రోజుల్లో పెద్ద వాహనాల బొమ్మలను తయారు చేస్తా. న్యూస్‌ పేపర్లతో బొమ్మల తయారీలో రికార్డు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న.
–రెడ్డి వెంకటవర్షిత్, విద్యార్థి, చెన్నూర్‌

మరిన్ని వార్తలు