డెంగీతో బాలుడి మృతి 

22 Aug, 2021 02:44 IST|Sakshi
జర్పుల మోహన్‌ (ఫైల్‌)

మరిపెడ రూరల్‌: మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండలం మంగోరిగూడెంలో డెంగీ సోకడంతో శనివారం ఓ బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన జర్పుల వీరన్న, కవిత దంపతుల కుమారుడు మోహన్‌ (14)కు 20 రోజులుగా జ్వరం వస్తుండటంతో స్థానికంగా ఓ ఆర్‌ఎంపీకి చూపించారు. అయినప్పటికి జ్వరం తగ్గకపోవడంతో 18న ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడికి పరీక్షలు చేసిన వైద్యులు డెంగీగా నిర్ధారించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు రిఫర్‌ చేశారు. అయితే హైదరాబాద్‌కు తరలించేలోపే మోహన్‌ చనిపోయాడు. బాలుడు మహబూబాబాద్‌లో 10వ తరగతి చదువుతున్నాడు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు