Hyderabad: ప్లీజ్‌.. దాతలు సహకరించండి 

13 Jul, 2022 13:52 IST|Sakshi
బ్లడ్‌ కేన్సర్‌తో బాధపడుతున్న బాలుడు ధర్మేంద్ర

 ‘టీ సెల్‌ లింపోబ్లాస్టిక్‌ ట్యుకేమియా’ అనే బ్లడ్‌ కేన్సర్‌తో బాధపడుతున్న బాలుడు ధర్మేంద్ర 

బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జరీ కోసం రూ.20 లక్షలు 

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని కూకట్‌పల్లికి చెందిన ధర్మేంద్ర మౌలి అనే నాలుగేళ్ల బాలుడు అరుదైన ‘టీ సెల్‌ లింపోబ్లాస్టిక్‌ ట్యుకేమియా’ అనే బ్లడ్‌ కేన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారని తండ్రి వీర నాగేంద్ర తెలిపారు. ఒక సూపర్‌ మార్కెట్‌లో చిన్న ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న తాను బాబు చికిత్స కోసం ఉన్న డబ్బులన్నీ వెచ్చించానని, ప్రస్తుతం సర్జరీ చేయడానికి రూ.20 లక్షలు ఖర్చవుతాయని అన్నారు.
చదవండి: సేవ చేయాల్సి వస్తుందని.. గొంతునులిమి తండ్రిని హత్య చేసిన కొడుకు

ప్రస్తుతం జరగుతున్న చికిత్సకు నగరంలోని ఓ స్వచ్ఛంద సంస్థ సహకారం అందిస్తుందని, కానీ సర్జరీకి అవసరమైన డబ్బుల కోసం దాతల సాయం కావాలని కోరారు. బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం కాకినాడ నుంచి నగరానికి వచ్చానని, తాను సంపాదించిన డబ్బులతో తన బాబుకు చికిత్స అందించే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సహకారం అందించాలనుకునే దాతలు తన మొబైల్‌ నంబర్‌ 9642842896లో సంప్రదించాని బాలుడి తండ్రి కోరాడు.  

మరిన్ని వార్తలు