మత్స్యావతారంలో యాదగిరీశుడు 

24 Feb, 2023 02:29 IST|Sakshi
విద్యుత్‌ వెలుగుల్లో యాదాద్రి క్షేత్రం, మత్సా్యవతార అలంకరణలో శ్రీలక్ష్మీనరసింహ స్వామికి హారతిస్తున్న ప్రధానార్చకులు  

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురువారం ఉదయం అలంకార సేవలకు శ్రీకారం చుట్టారు. ఆలయంలో ఉదయం నిత్య పూజలు, నిత్య పూర్ణాహుతి, ఆరాధనలు పూర్తయ్యాక.. 9గంటలకు మత్స్యావతార అలంకారంలో సేవోత్సవం నిర్వహించారు. ప్రధానాలయం తిరు మాడ వీధుల్లో ఊరేగించారు. 

పడమటి రాజగోపురం ముందున్న వేంచేపు మండపం వద్ద శ్రీస్వామి వారి మత్స్యావతార సేవను ప్రారంభించారు. రాత్రి ఆలయంలో నిత్యారాధనలు ముగిశాక 7గంటలకు శేష వాహనంపై శ్రీనారసింహస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. మత్సా్యవతార, శేష వాహన సేవల విశిష్టతను ఆలయ ప్రధానార్చకుడు నల్లంథీఘల్‌ లక్ష్మీనరసింహచార్యులు భక్తులకు వివరించారు. 

మరిన్ని వార్తలు