ఆర్‌ఎఫ్‌సీఎల్‌ షట్‌డౌన్‌

2 Sep, 2023 03:12 IST|Sakshi

వారంరోజులు యూరియా ఉత్పత్తికి బ్రేక్‌

ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్‌ కెమికల్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌ సీఎల్‌) కర్మాగారంలో మరమ్మతుల కార ణంగా గురువారం రాత్రి నుంచి యూరి యా ఉత్పత్తి నిలిచిపోయింది. హీటర్‌ సెక్ష న్‌ పైపులు మరమ్మతులు చేయడానికి వా రంరోజుల దాకా సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు.  శుక్ర వారం మరమ్మతులు ప్రారంభించారు. వానాకాలం సీజన్‌ కావడంతో తెలు గురాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో యూరియాకు డిమాండ్‌ అధికంగా ఉంది. 

నిత్యం సాంకేతిక సమస్యలు: ఫ్యాక్టరీలో జూన్‌లో కూడా సాంకేతిక సమ స్యలతో 20 రోజులపాటు యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. మరమ్మతుల అనంతరం ప్లాంట్‌ పునరుద్ధరించినా, రెండు రోజులకే మళ్లీ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. జూన్‌ చివరివారంలో ఉత్పత్తి ప్రారంభించారు.

సాంకేతిక సమ స్యలతో ఆగస్టులో ఉత్పత్తి కొంత తగ్గింది. మళ్లీ సమస్య తలెత్తడంతో కర్మా గారాన్ని తాత్కాలికంగా వారం పాటు షట్‌డౌన్‌ చేసి మరమ్మతుల అనంతరం ఉత్పత్తి పునరుద్ధరిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. కర్మాగారంలో గడిచిన 4 నెలల్లో 5,01,597.63 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. 2023– 24లో 12.70 లక్షల మెట్రిక్‌టన్నుల యూరియా ఉత్పత్తి చేయాలనేది టార్గెట్‌.

మరిన్ని వార్తలు