కట్నం డబ్బుతో వరుడు పరార్‌.. ఇంకెవరూ తనలా మోసపోకూడదని ఏం చేసిందంటే!

20 Dec, 2021 08:40 IST|Sakshi

సాక్షి,సంగారెడ్డి అర్బన్‌: కట్నం డబ్బుతో వరుడు పరారవడంతో ఈనెల 12న జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన వరుడు న్యాయవాది మాణిక్‌రెడ్డి కట్నం డబ్బులతో పరారయ్యాడని ఆరోపిస్తూ కంది మండలం చిమ్నాపూర్‌ గ్రామానికి చెందిన వధువు సింధురెడ్డి ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని రూరల్‌ పోలీస్‌ స్టేషన్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తాను మోసపోయినట్లుగా ఎవరూ మోసపోకూడదని మూడు రోజులపాటు న్యాయపోరాటం చేసింది.

వాట్సప్‌ గ్రూపుల్లో ప్రచారం, వధువు ఫిర్యాదు మేరకు వరుడిని పట్టుకొని పెళ్లికి ఒప్పంచినట్లు ఎస్‌ఐ సుభాష్‌ తెలిపారు. వివాహానికి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, కంది ఎంపీటీసీ నందకిషోర్, టీఆర్‌ఎస్‌ నాయకుడు కొత్తకాపు శ్రీధర్‌రెడ్డి, పలువురు న్యాయవాదులు, పెళ్లి పెద్ద దేవేందర్, ప్రకాశం హాజరయ్యారు.

మరో ఘటనలో..

స్థానికత ఆధారంగా నియామకాలు చేపట్టాలి
ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): నూతన జిల్లాలలో ఉద్యోగుల వర్గీకరణలో భాగంగా స్థానికత ఆధారంగా ఉద్యోగా నియామకాలు చేపట్టాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు పట్నం భూపాల్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన  సంఘం జిల్లా సమావేశంలో భూపాల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకున్నవారు ఇతర జిల్లాలకు వలసలు వెళ్లాల్సి రావడం ఇబ్బందికరమన్నారు. స్థానికంగా ఉన్న వారికి ఆ జిల్లాలోనే అవకాశం కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. 317 జీవో స్థానిక ఉద్యోగులకు శాపంగా మారిందన్నారు. అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలు ఉన్నా జీవో 317 ముందుకు తీసుకోచ్చి ఉపాధ్యాయులకు బలవంతంగా  జిల్లాల కేటాయింపు చేస్తున్నారన్నారు.  కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు రంగారావు, శ్రీధర్, శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి, ఉండ్రాళ్ల రాజేశం, గురువయ్య, యాదగిరి, ఎల్లయ్య,  రాజు, శ్రీనాథ్, రాములు, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: కిక్కులేకుంటే రోడ్డెక్కలేరా.. గాడితప్పుతున్న జీవితాలు

మరిన్ని వార్తలు