జూరాల కాల్వపై కూలిన వంతెన 

15 Dec, 2021 01:34 IST|Sakshi

భారీ వాహనం వెళ్లడంతో ఘటన    

ధరూరు (గద్వాల): వాహనం బరువును తట్టుకోలేక ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన కుడికాల్వపై నిర్మించిన వంతెన కూలింది. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం భీంపురం సమీపంలో జూరాల–ఆత్మకూరు, మక్తల్‌ ప్రధాన రోడ్డు మార్గం నుంచి భీంపురం, పెద్దచింతరేవులకు రాకపోకలు సాగించేందుకు సుమారు 30 ఏళ్ల క్రితం రోడ్‌–కం–బ్రిడ్జిని నిర్మించారు.

అప్పటినుంచి ఇదే మార్గం గుండా ఈ రెండు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం భీంపురానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి నిర్మాణంకోసం స్లాబ్‌ వేసేందుకు కాంక్రీటు మిశ్రమంతో కూడిన భారీ వాహనం (30 టన్నుల ట్రాంక్‌ మిక్చర్‌) వచ్చింది. వంతెన మధ్యలోకి రాగానే బ్రిడ్జి కూలింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ వాహనాన్ని అలాగే ఆపి కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది.  

మరిన్ని వార్తలు