రెండో రోజు ఈడీ విచారణకు రోహిత్‌ రెడ్డి.. అందువల్లే ఆలస్యమైందని వెల్లడి

20 Dec, 2022 15:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండో రోజు ఈడీ కార్యాలయానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి హాజరయ్యారు. మానీలాండరింగ్‌ కేసులో ఈడీ అడిగిన ఫార్మాట్‌తో వివరాలతో విచారణకుహజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఈడీ అధికారులు ఉదయం 10.30 గంటలకు రమ్మన్నారని తెలిపారు. అయ్యప్ప దీక్షలో ఉండటంతో పూజా కార్యక్రమం వల్ల రాలేకపోయానని తెలిపారు. అయ్యప్ప దీక్ష కారణంగా ఆలస్యం అవుతుందని ఉదయం ఈడీ అధికారులకు మెయిల్‌ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో మధ్యాహ్నం తరువాత విచారణకు వచ్చేందుకు ఈడీ అధికారులు అనుమతిచ్చారన్నారు. పూజ , భిక్ష పూర్తి చేసుకొని  విచారణకు వచ్చినట్లు తెలిపారు.

కాగా మానీలాండరింగ్‌ కేసులో రోహిత్‌ రెడ్డిని ఈడీ విచారిస్తోంది. ఎమ్మెల్యేపై ఈసీఐఆర్‌ 48/2020 ప్రకారం కేసు నమోదు చేసి ప్రశ్నిస్తోంది. సోమవారం సుమారు ఆరుగంటలపాటు రోహిత్‌ రెడ్డిని ప్రశ్నించిన ఈడీ.. మరోసారి మంగళవారం విచారణకు రావాలని ఆదేశించింది. పర్సనల్ ప్రొఫైల్, బిజినెస్ ప్రొఫైల్‌తో హాజరు కావాలని ఈడీ తెలిపింది. రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యుల వివరాలు..  విదేశీ ప్రయాణాలు, ఫోన్ నెంబర్స్ తీసుకురావాలని పేర్కొంది. రోహిత్ రెడ్డిఫై గతంలో నమోదు అయినా కేసుల వివరాలు తెలపాలంది. కంపెనీ ఇన్‌కం టాక్స్ వివరాలు తీసుకురావాలని చెప్పింది. ఎమ్మెల్యే ఆర్థిక స్థితిగతుల వివరాలు, బ్యాంకు అకౌంట్స్, లాకర్స్ వివరాలు సమర్పించాలని తెలిపింది. ఈడీ అడిగిన వివరాలతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ ముందు హాజరయ్యారు.
చదవండి: దిగ్విజయ్‌ని నియమించటం హర్షణీయం: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

మరిన్ని వార్తలు