ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: విచారణకు అంత తొందరెందుకు?

8 Feb, 2023 11:41 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం కోర్టులోనూ తెలంగాణ సర్కార్‌కు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది ప్రభుత్వం. అయితే.. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు.. తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టేటస్‌కో విధించేందుకు మాత్రం నిరాకరించింది. 

మెరిట్స్‌ ఉంటేనే హైకోర్టు తీర్పును రివర్స్‌ చేస్తామని ప్రభుత్వానికి స్పష్టం చేసింది ధర్మాసనం. అలాగే.. త్వరగతిన కేసు విచారించాలని ప్రభుత్వం తరపున న్యాయవాది కోరగా.. అందుకు అంతతొందరెందుకు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. పిటిషన్‌పై ఈ నెల 17వ తేదీన విచారణ చేపడతామని తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది. 

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశించగా.. తెలంగాణ సర్కార్‌ అందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.

మరిన్ని వార్తలు