తెలంగాణలో ఆరు నెలల్లో ఎన్నికలు ఖాయం: ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌

24 Nov, 2022 05:20 IST|Sakshi

సిద్దిపేటజోన్‌: తెలంగాణలో ఆరు నెలల్లో ఎన్నికలు రావడం ఖాయమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వెళ్తూ బుధవారం సిద్దిపేటలోని పార్టీ కార్యాలయంలో తన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీఎస్పీ శ్రేణులకు కేవలం 180 రోజుల సమయం ఉందని, గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరూ మరో 55 మంది కార్యకర్తలను తయారు చేయాలని, సామాజిక మాధ్యమాల్లో కాకుండా బహుజన కార్యకర్తలు గ్రామాల్లో ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకుగాను ‘మై బీఎస్పీ టాక్‌ ఇన్‌’అనే పోర్టల్‌ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. తనపై కేసులు పెట్టినా, బెదిరింపులకు పాల్పడినా భయపడేదిలేదన్నారు.

ఇదీ చదవండి: డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు లైన్‌ క్లియర్‌.. లబ్ధిదారుల ఎంపిక షురూ!

మరిన్ని వార్తలు