Bullet Train Project: మరింత ‘స్పీడ్‌’గా! 

25 May, 2021 04:39 IST|Sakshi

బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు రూట్‌ ఏరియల్‌ సర్వేకు సన్నాహాలు

సాక్షి, హైదరాబాద్‌: ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న బుల్లెట్‌ రైలు కల త్వరలో సాకారం కానుంది. హైదరాబాద్‌–ముంబై మధ్య బుల్లెట్‌ ట్రైన్‌ నడిపేందుకు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టును నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు రూట్‌ సర్వే/నిర్మాణం కోసం చేపట్టిన గూగుల్‌ మ్యాపింగ్‌ తుది దశకు చేరుకుంది.వారం, 10 రోజుల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నట్లు నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ వర్గాలు తెలిపాయి.

జీపీఎస్‌ ఆధారిత ఏరియల్‌ సర్వే కోసం ప్రస్తుతం నవీ ముంబై నుంచి హైదరాబాద్‌ వరకు పిల్లర్లను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా వికారాబాద్‌– తాండూరు మధ్య దిమ్మెల నిర్మాణం కూడా పూర్త యింది. ఏరియల్‌ సర్వే నెల రోజుల్లో పూర్తి కావొ చ్చని తెలుస్తోంది. సాంకేతిక ప్రక్రియ పూర్తయిన తర్వాత హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. ‘ఈ రెండు నగరాల మధ్య హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మాణం పూర్తయి బుల్లెట్‌ రైలు పట్టాలెక్కేందుకు కనీసం 3 నుంచి నాలుగేళ్లు పట్టే అవకాశం ఉంది’ అని ద.మ«. రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.

మొత్తం 711 కిలోమీటర్ల మార్గం..
ప్రస్తుతం ముంబైలో రైల్వే టర్మినళ్లు ఎక్కువగా ఉన్న దృష్ట్యా నవీ ముంబై నుంచి హైదరాబాద్‌ వరకు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మిస్తున్నారు. మొత్తం 711 కిలోమీటర్ల మార్గంలో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఈ పట్టాలపైన బుల్లెట్‌ రైలు గం టకు 320 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. మూడున్నర గంటల సమయంలోనే హైదరాబాద్‌ నుంచి ముంబైకి చేరుకోవచ్చు.

ప్రస్తుత రైళ్లు హైద రాబాద్‌ నుంచి ముంబైకి చేరుకునేందుకు 13 నుంచి 14 గంటల సమయం పడుతోంది. కాగా, నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ దేశవ్యాప్తంగా 6 కారిడా ర్లలో 4,109 కి.మీ. మేర హైస్పీడ్‌ ట్రాక్‌లను నిర్మిం చనుంది. ముంబై– అహ్మ దాబాద్, ముంబై– నాసి క్‌– నాగ్‌పూర్, చెన్నై– బెంగళూరు– మైసూరు, ముంబై– హైదరా బాద్, ఢిల్లీ– వారణాసి, ఢిల్లీ– అహ్మదాబాద్, ఢిల్లీ– అమృత్‌సర్‌ మార్గాలు ఉన్నాయి.


 

మరిన్ని వార్తలు