బురఖా ధరించి కోర్టుకు వచ్చిన వ్యక్తి.. ఎందుకంటే..?

28 Jul, 2022 18:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కరీంనగర్‌: భార్య తనపై పెట్టిన కట్నం వేధింపుల కేసులో కోర్టు వాయిదాలకు నిందితుడు బుధవారం బురఖా వేసుకొని జిల్లా కోర్టు ఆవరణలోని పీసీఆర్‌ కోర్టుకు హాజరయ్యేందుకు రావటం సంచలనం రేపింది. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం నుస్తులాపూర్‌ గ్రామానికి చెందిన పల్లె శ్రీనివాసరెడ్డిపై అతడిభార్య కట్నం వేధింపుల కేసు పెట్టింది.

వాయిదాలకు కోర్టుకు హాజరవుతున్నాడు. మధ్యలో ఓ వాయిదాకు హాజరు కాకపోవడంతో కోర్టు అతడిపై వారెంట్‌ జారీ చేసింది. భార్య తరఫువారితో ప్రాణభయం ఉండటం, వారెంట్‌పై పోలీసులు పట్టుకోకుండా ఉండేందుకు బురఖా ధరించి కోర్టుకు వచ్చాడు. కొందరు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

టూటౌన్‌ పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇతనివెంట తండ్రి, తల్లి, చెల్లి రాగా.. పోలీసులు అరెస్టు చేయడంతో తండ్రి మల్లారెడ్డి వెంటతెచ్చుకున్న పురుగుల మందు తాగి కిందపడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. తరువాత తనపై ఉన్న వారెంటును తొలగించుకునేందుకు శ్రీనివాసరెడ్డి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసుకోగా కోర్టు అనుమతి ఇచ్చింది. తన భార్య తప్పుడు కేసు పెట్టి ఇబ్బందికి గురి చేస్తోందని, ప్రాణ భయం ఉండడంతో ఇలా బురఖా ధరించి వచ్చానని శ్రీనివాస్‌రెడ్డి ఏడ్వడం కలవరపరిచింది. (క్లిక్‌: ‘ఊపిరి’ పోసిన ఎస్‌ఐ)

మరిన్ని వార్తలు