నిరుద్యోగులకు బస్‌పాస్‌లో 20 శాతం రాయితీ

1 May, 2022 07:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు బస్‌ పాస్‌ల్లో ఆర్టీసీ రాయితీ ప్రకటించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో మూడు నెలల పాస్‌లపై 20 శాతం చొప్పున  రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ  గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ యాదగిరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం మూడు నెలల (క్వార్టర్లీ) ఆర్డినరీ బస్‌పాస్‌ రూ.3,450 ఉండగా.. 20 శాతం రాయితీ  రూ.2800కు పాస్‌లు ఇస్తారు. మెట్రో మూడు నెలల పాస్‌ (క్వార్టర్లీ) ప్రస్తుతం  రూ.3900. 20 శాతం డిస్కౌంట్‌ అనంతరం రూ.3120. రౌండెడ్‌ ఆఫ్‌తో రూ.3200కు పాస్‌లను పొందవచ్చు. పాస్‌ల కోసం తీసుకొనే గుర్తింపు కార్డుకు రూ.30 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.   

ఆర్టీసీ తాత్కాలిక బస్‌షెల్టర్లు
రహదారుల విస్తరణ కారణంగా తొలగించిన బస్‌షెల్టర్ల స్థానంలో ఆర్టీసీ  గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ తాత్కాలిక షెల్టర్‌లను ఏర్పాటు చేసింది. తొలగించిన బస్‌షెల్టర్‌లను జీహెచ్‌ఎంసీ ఇప్పటి వరకు పునర్నిర్మించకపోవడంతో ప్రయాణికులు మండుటెండల్లో పడిగాపులు కాస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని  ప్రయాణికుల సదుపాయం కోసం 24 బస్టాపుల్లో తాత్కాలిక షెల్టర్‌లను ఏర్పాటు చేసినట్లు  ఆర్టీసీ  గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ యాదగిరి  తెలిపారు.

భరత్‌నగర్‌ (ఎర్రగడ్డ వైపు), ప్రగతినగర్, ఎల్లంపేట్‌ క్రాస్‌రోడ్, ఆర్సీపురం, ఉప్పల్‌ (రేణుక వైన్స్‌), యాప్రాల్, కాచిగూడ క్రాస్‌రోడ్స్, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్, కొత్తగూడ ఎక్స్‌రోడ్స్, జియాగూడ గాంధీ విగ్రహం, నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రి, అడిక్‌మెట్, నారాయణగూడ (హిమాయత్‌నగర్‌ వైపు), బర్కత్‌పురా పీఎఫ్‌ ఆఫీస్, అఫ్జల్‌గంజ్, జిల్లెలగూడ, జైపురికాలనీ, మన్నెగూడ, ఎల్‌బీనగర్, ఉప్పల్‌ క్రాస్‌రోడ్స్, ఉప్పల్‌ డిపో తదితర ప్రాంతాల్లో టెంట్లు వేసి తాత్కాలిక షెల్టర్‌లను ఏర్పాటు చేసినట్లు  పేర్కొన్నారు.    

(చదవండి: పుట్టగానే ఆధార్‌!)

మరిన్ని వార్తలు