ప్రయాణికుడి ట్వీట్‌.. స్పందించిన సజ్జనార్‌

8 Dec, 2021 08:00 IST|Sakshi

వేములవాడ: ప్రయాణికుడు చేసిన ట్వీట్‌కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పందించారు. వేములవాడకు చెందిన వెల్దండి సదానందం ఈనెల 6న వేములవాడ నుంచి కరీంనగర్‌కు బస్సులో ప్రయాణించారు. ఆ సమయంలో డ్రైవర్‌ సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ కనిపించడంతో వీడియో తీసి ట్విట్టర్‌లో సజ్జనార్‌కు పోస్టుచేశారు. దీనిపై స్పందించిన సజ్జనార్‌ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

చదవండి: Drunk And Drive Test: ఇక రోజూ డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు చుక్కేస్తే.. చిక్కినట్టే!

అదేరోజు కరీంనగర్‌లో దిగి బస్టాండ్‌లో మరుగుదొడ్ల నిర్వహణ, వాటర్‌ బాటిళ్ల అమ్మకాలపై అధిక వసూళ్లు చేస్తున్నట్లు పోస్టు చేయడంతో వారికి రూ.5 వేలు జరిమానా విధించాలని ఆదేశించారు. కరీంనగర్‌ నుంచి హుస్నాబాద్‌ వెళ్లే క్రమంలో కండక్టర్‌ మాస్క్‌ లేకుండా విధులు నిర్వహిస్తున్న ఫొటో షేర్‌ చేయడంతో కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. 

మరిన్ని వార్తలు