సౌరశక్తిపై అవగాహనకు బస్సుయాత్ర

13 Mar, 2022 08:59 IST|Sakshi

ఖైరతాబాద్‌: గ్లోబల్‌ వార్మింగ్‌ చేరుకోవడానికి ఇంకా 8–10 సంవత్సరాలు మాత్రమే ఉందని, అందువల్ల వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి తీవ్రమైన తక్షణ చర్యలు అవసరమని సోలార్‌ ఎనర్జీ బ్రాండ్‌ అంబాసిడర్‌ డాక్టర్‌ చేతన్‌ సింగ్‌ సోలంకి అన్నారు. ఆదివారం ఖైరతాబాద్‌ విశ్వేశరయ్య భవన్‌లో సోలార్‌ ఎనర్జీపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి చేపట్టిన బస్సు యాత్రను ఆదివారం ప్రారంభించారు.

ఈ యాత్ర మొత్తం బస్సులోనే నిర్వహించే విధంగా రూపొందిన బస్సులో 3.2 కిలోవాట్స్‌ సోలార్‌ ప్యానల్స్, ఆరు కిలోవాట్ల బ్యాటరీ స్టోరేజీ అమర్చారు. ఇది సౌరశక్తితో పేనిచేసే మూడు కిలోవాట్ల  ఇన్వర్టర్‌ని కలిగి ఉంటుంది. లైట్లు, ఏసీ, కుక్‌స్టవ్, టీవీ, ఏసీ, ల్యాప్‌టాప్‌ మరియు బస్సులోపల అన్ని చార్జ్‌ అవుతాయి. సుదీర్గ ప్రయాణంలో భాగంగా ఎనర్జీ స్వరాజ్‌ బస్సు యాత్రను ప్రారంభిస్తున్నట్లు చేతన్‌ సింగ్‌ సోలంకి తెలిపారు. ఎనర్జీ స్వరాజ్‌ బస్సు రెండు రోజుల పాటు ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో సందర్శకుల కోసం అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఐఈఐ చైర్మన్‌ బ్రహ్మారెడ్డి, డాక్టర్‌ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.  

(చదవండి: జాలీ జర్నీ...మళ్లీ రానున్న డబుల్‌ డెక్కర్‌ బస్సులు!)

మరిన్ని వార్తలు