వరంగల్‌లో క్యాంపస్‌ సెలక‌్షన్స్‌

30 Sep, 2021 17:03 IST|Sakshi

వరంగల్‌ : నగరంలోని న్యూసైన్స్‌ కాలేజీలో 2021 అక్టోబరు 1న మెగా క్యాంపస్‌ సెలక‌్షన్స్‌ జరగనున్నాయని కాలేజీ డైరెక్టర్లు కే రవీందర్‌రెడ్డి, జే శ్రీధర్‌రావులు తెలిపారు. ఈ క్యాంపస్‌ సెలక‌్షన్స్‌లో టెక్‌ మహీంద్రా, ఎయిర్‌టెల్‌, పేటీఎం, శామ్‌సంగ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ తదితర 25 ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నట్టు తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ ఫైనలియర్‌ పాసై విద్యార్థులు ఈ క్యాంపస్‌ సెలక‌్షన్స్‌లో పాల్గొనవచ్చని తెలిపారు. అయితే విద్యార్థులు వయస్సు 28 ఏళ్లు మించరాదని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కోరారు. 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు