రేపే కౌన్సిలింగ్ ..క్యూ కట్టిన ఎంసెట్ అభ్యర్థులు

8 Oct, 2020 13:01 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్‌ ఫ‌లితాల్లో ర్యాంకులు రాని అభ్య‌ర్థులు  జేఎన్‌టీయూహెచ్ ద‌గ్గ‌ర క్యూ క‌ట్టారు. రేప‌టి నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుండటంతో  విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళ‌లో ఉన్నారు.  టీఎస్ ఎంసెట్ కార్యాలయంలో విద్యార్థులు త‌మ ఫోటో కాపీలు సమర్పిస్తున్నారు.  కౌన్సిలింగ్ ఉన్న నేప‌థ్యంలో రేపటి లోగా ర్యాంకు కేటాయించక పోతే ఎలా అని త‌ల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అక్నాలెడ్జ్మెంట్ కాపీలు  ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుండ‌టంతో జేఎన్‌టీయూహెచ్ వ‌ద్ద ఉద్రిక్తత నెల‌కొంది. సెప్టెంబర్‌ 9,10,11,14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో ఎంసెట్  పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం  1,43,330 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా, 1,19,187 మంది (83.16 శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.  9వ తేదీ నుంచి ఇంజనీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ తరువాత రెండు మూడుల్లో వారి  ఫలితాలను విడుదల చేయనుంది.  ఇక గత నెల 28, 29 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్‌ ఎంసెట్‌ ఫలితాలను కూడా వచ్చే వారంలో విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది.
 

మరిన్ని వార్తలు