తాటిచెట్టును పట్టుకొని ముగ్గురు..

14 Oct, 2020 03:34 IST|Sakshi

జనగామ: జనగామ మండలం వడ్లకొండ వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. నర్మెట నుంచి జనగామ వైపు వస్తున్న కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంతో మంగళవారం రాత్రి సుమారు 10.20 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలను నిలిపివేసి పోలీసులు కాపలాగా ఉన్నారు. ఆ రహదారిపై వస్తున్న కారును ముందు రావొద్దని పోలీసులు వారించినా డ్రైవర్‌ వినిపించుకోకుండా దూసుకొచ్చాడు. కల్వర్టుపైకి రాగానే వరద ఉధృతికి కారు చీటకోడూరు రిజర్వాయర్‌ వైపు కొట్టుకుపోయింది. ఈ సమయంలో కారులో ఉన్న ఓ వ్యక్తి తాటిచెట్టును గట్టిగా పట్టుకోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. వెంటనే మిగతా ఇద్దరు కూడా చెట్టును పట్టుకున్నారు. భారీక్రేన్‌ తెప్పించి ఈ ముగ్గురి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు