ఎమ్మెల్యేల కేసు: రామచంద్ర భారతికి ఊహించని షాక్‌.. ఉచ్చు బిగుసుకుంటోందా!

23 Nov, 2022 16:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు ఇప్పటికే పలు ‍ట్విస్టులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ కేసులో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో రామచంద్ర భారతికి ఊహించని షాక్‌ తగిలింది.

ఎమ్మెల్యేల కొనుగోలులో నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతిపై బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో మరో ఫిర్యాదు నమోదైంది. రామచంద్ర భారతిపై సిట్‌ అధికారి గంగాధర్‌ ఫిర్యాదు చేశారు. విచారణ సమయంలో ఐఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌లో నకిలీ పాస్ట్‌పోర్ట్‌ లభ్యమైంది. కర్నాటక అడ్రస్‌తో T9633092 నెంబర్‌తో నకిలీ పాస్‌పోర్ట్‌ దొరికింది. దీంతో, ఆయనపై 467, 468, 471, ఐపీసీ12(3) పాస్‌పోర్ట్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

మరోవైపు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌కు మరోసారి నోటీసులివ్వాలని సిట్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ సీఆర్‌పీసీ కింద వాట్సాప్‌, ఈ మెయిల్‌ ద్వారా నోటీసులు పంపాలని తెలిపింది. ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు