ఓటుకు నోటు కేసు : ఎమ్మెల్యే సండ్రకు నిరాశ

8 Dec, 2020 20:11 IST|Sakshi

సండ్ర వెంకట వీరయ్య డిశ్చార్జ్ పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌ :  ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు తెలంగాణ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఈ కేసు నుంచి తనను తొలగించాలంటూ ఆయన పెట్టుకున్న డిశ్చార్జ్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. మరోవైపు ఏసీబీ కోర్టులో ఈరోజు జరిగిన విచారణకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహాలు గైర్హాజరయ్యారు. డిసెంబర్‌ 15న జరిగే తదుపరి విచారణకు అందరూ హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఇకపై హాజరు మినహాయింపు కోసం వేసే పిటిషన్లను అనుమతించబోమని స్పష్టం చేసింది. 

కాగా, 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు