క్యాసినో బిజినెస్ చేశాను.. నాకు ప్రాణహాని ఉంది: చికోటి ప్రవీణ్‌

5 Aug, 2022 14:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క్యాసినోవాలా చికోటి ప్రవీణ్‌ను నాలుగో రోజు విచారించింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. విచారణ అనంతరం బయటకు వచ్చిన ప్రవీణ్‌.. మీడియాతో మాట్లాడాడు. ఈడీ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాను. విచారణ అంతా పూర్తి అయిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేస్తా. పనిగట్టుకుని కొంతమంది నాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని చికోటి వెల్లడించాడు.

‘సోషల్ మీడియాలో నా పేరుతో ఫేక్ అకౌంట్స్‌ క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఇదే విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశాను. నాకు ప్రాణహాని ఉందని నాకు రక్షణ కల్పించాలని హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాను. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఇకపై కూడా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాను. క్యాసినో బిజినెస్ చేసాను. అందులో తప్పేముంది. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. పని గట్టుకొని కొంతమంది నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఈడీ విచారణ పూర్తి అయినా తర్వాత అన్ని వివరాలు వెళ్లాడిస్తా.’ అని తెలిపాడు. 

ఇదీ చదవండి: ఖాతాలు ఎవరివి.. కాసులు ఎక్కడివి? రెండో రోజు చీకోటిపై ప్రశ్నల వర్షం

మరిన్ని వార్తలు