సెకండ్‌ వేవ్‌ ముగిసిందనుకోవద్దు..

20 May, 2021 01:08 IST|Sakshi

తగ్గిందో లేదా తెలియాలంటే ఇంకో వారం పడుతుంది..  

గ్రామాల్లో కరోనా పరీక్షలు పెరగాల్సిన అవసరం ఉంది 

రూపాంతరితాల గుర్తింపునకు జన్యుక్రమాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది

సీసీఎంబీ గౌరవ సలహాదారు డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సెకండ్‌ వేవ్‌ ముగింపు దశకు వచ్చిందా? గత 4 రోజులుగా కేసుల్లో తగ్గుదల నమోదవుతుండటాన్ని చూస్తే.. అలాగే అనిపించవచ్చు కానీ.. ఈ విషయంలో అంత తొందర వద్దంటున్నారు సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ (సీసీఎంబీ) గౌరవ సలహాదారు డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా. వారం రోజుల సగటులో కేసుల తగ్గుదల ఉంటేనే వ్యా ధి తగ్గుముఖం పడుతున్నట్లు భావించాలని ఆ యన ‘సాక్షి’తో మాట్లాడుతూ వివరించారు. దేశంలో కోవిడ్‌ కేసుల సంఖ్య 4 రోజులుగా తగ్గు తూ వస్తోంది. రోజుకు 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్న దశ నుంచి 2.6 లక్షల స్థాయికి కేసులు తగ్గాయి. కానీ దీని ఆధారంగా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టిందన్న అంచనాకు రావడం సరికా దని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తం గా కరోనా నిర్ధారణ పరీక్షలు గరిష్ట స్థాయిలో జరుగుతున్నా అత్యధికం నగర ప్రాంతాలకే పరిమితమయ్యాయన్నా రు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో తప్పులు, మరికొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసు కుంటే సెకండ్‌ వేవ్‌ తగ్గిందా.. లేదా అన్నది తెలిసేందుకు ఇంకో వారం పట్టొచ్చన్నారు. గ్రామా ల్లో పరీక్షలు, నిఘా మరింత పెంచాలని, తద్వా రా వ్యాధి మరోసారి ప్రమాదకరంగా మారకుం డా చూడొచ్చని సూచించారు. 

జన్యుక్రమ నమోదు కొనసాగుతోంది.. 
దేశంలో వైరస్‌ రూపాంతరితాలను గుర్తించేందు కు వాటి జన్యుక్రమాలను గుర్తించే ప్రక్రియ కొన సాగుతోందని రాకేశ్‌ మిశ్రా తెలిపారు. ‘ఈ ఏడా ది జనవరిలో దాదాపు 6 వేల వైరస్‌ జన్యుక్రమాలను విశ్లేషించాం. ఇప్పటివరకు దేశంలో దాదా పు 7,500 రూపాంతరితాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలకు ఇప్పటికే తెలుసు’ అని వివరించారు. ‘ఈ రూపాంతరితాల్లో కొన్నింటితో మాత్రమే ప్రమా ద తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి యూకే వేరియంట్‌ దేశంలో ఎక్కువగా వ్యాపిస్తోంది. కొత్తగా గుర్తించిన రూపాంతరితాల్లో ఆందోళన కలిగించేవి ఏవీ లేవు’ అని తెలిపారు.  


వ్యాక్సిన్లు పని చేస్తాయి: ‘కరోనా వైరస్‌ జన్యుమార్పులకు గురవుతున్నా ఇప్పటివరకు అభివృ ద్ధి చేసిన టీకాలు వాటిని సమర్థంగా అడ్డుకుంటున్నాయి. యాంటీబాడీలు తక్కువున్నంత మా త్రాన టీకా పనిచేయట్లేదని కాదు. వైరస్‌ను అడ్డుకునేందుకు కావాల్సినన్ని యాంటీబాడీలు ఉత్ప త్తి అయితే చాల’ని రాకేశ్‌మిశ్రా వివరించారు.
 
జంతుజాలంపై నిఘా: కరోనా వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకిన నేపథ్యంలో భ విష్యత్తులో ఇలాంటి విపత్తులను నివారించేందు కు జంతుజాలంపై నిఘా కొనసాగాలని రాకేశ్‌ మిశ్రా తెలిపారు. కరోనా కుటుంబంలో 32 వైరస్‌లున్నా.. మనిషికి ఏడింటి గురించే తెలుసని, ఎప్పుడు ఏ వైరస్‌ మనుషులకు ప్రబలుతుందో తెలుసుకునేందుకు అటవీ జంతువులను పరిశీలిస్తూనే ఉండాలని ఆయన పేర్కొన్నారు. 

2–డీజీతో మేలే.. 
కరోనా చికిత్స కోసం భారత రక్షణ ప రిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) త యారు చేసిన 2–డీజీపై సీసీఎంబీలో పరీక్ష లు జరిగాయని, ఇది సమర్థంగా పనిచేస్తుం దని స్పష్టమైందని రాకేశ్‌ మిశ్రా తెలిపారు. డీఆర్‌డీవో అనుబంధ సంస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అల్లైడ్‌ సైన్సెస్‌ (ఇన్‌మాస్‌) అభివృద్ధి చేసిన ఈ మందుతో ఆక్సిజన్‌ అవసరం తగ్గిపోవడ మే కాకుండా.. ఆస్పత్రిలో ఉండాల్సిన స మయం తగ్గుతుందని చెప్పారు. ఈ మం దును ఇప్పటికే పలు ప్రాంతాల్లో వినియోగి స్తున్నారని.. ఫలితాలేమిటన్నది మరికొన్ని రోజుల్లో స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు.  

మరిన్ని వార్తలు