యూకే స్ట్రెయిన్‌ ప్రమాదకరం కాదు: సీసీఎంబీ

29 Dec, 2020 20:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  బ్రిటన్‌ స్ట్రెయిన్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. యూకేలో కొత్త రకం కరోనా వైరస్‌ వెలుగుచూడటంతో అక్కడి నుంచి అనేక మంది భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో అక్కడి నుంచి వచ్చినవారిని గుర్తించి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. వీరిలో కొందరికి పాజిటివ్‌గా తేలగా, ఈ వైరస్‌ యూకే రకానికి చెందిందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు సీసీఎంబీకి శాంపిళ్లు పంపించారు. ఈ పరిశోధనలో యూకే స్ట్రెయిన్ ప్రమాదకరం కాదని సీసీఎంబీ వెల్లడించింది. కానీ వేగంగా విస్తరిస్తోందని తెలిపింది. స్ట్రెయిన్‌ను B.1.1.7 రకం కరోనా వైరస్‌గా సీసీఎంబీ పేర్కొంది. స్ట్రెయిన్‌కు 71శాతం వేగంగా వ్యాపించే శక్తి ఉందని తెలిపింది. స్ట్రెయిన్‌ 17 రకాల పరివర్తన కలిగి ఉందని పేర్కొంది. చదవండి: ఫ్లైట్‌ దిగారు.. పత్తా లేరు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు