సీడ్యాక్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు

11 May, 2021 16:05 IST|Sakshi

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీ–డ్యాక్‌).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 44
► పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ మేనేజర్‌–03, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌–39, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌–02.

ప్రాజెక్ట్‌ మేనేజర్‌: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, వివిధ టెక్నికల్‌ నైపుణ్యాలు తెలిసి ఉండాలి. వయసు: దరఖాస్తు చేసే నాటికి 50 ఏళ్లు మించకుండా ఉండాలి. వేతనం నెలకు రూ.64,000–రూ.89,000 చెల్లిస్తారు.

ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, వివిధ టెక్నికల్‌ నైపుణ్యాలు తెలిసి ఉండాలి. వయసు: దరఖాస్తు  చేసే నాటికి 50 ఏళ్లు మించకుండా ఉండాలి. వేతనం నెలకు రూ.31,000 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:24.05.2021
► వెబ్‌సైట్‌: https://www.cdac.in/index.aspx?id=current_jobs

CDFD Recruitment 2021: సీడీఎఫ్‌డీ, హైదరాబాద్‌లో ఉద్యోగాలు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు