నవంబర్‌ 1 నుంచి ఓటర్ల నమోదు 

6 Aug, 2021 03:24 IST|Sakshi

2022 జనవరి 1 నాటికి 

18 ఏళ్లు నిండిన వారు అర్హులు

సాక్షి, హైదరాబాద్‌: నవంబర్‌ 1 నుంచి రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం– 2022 షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2022 జనవరి 1 నాటికి 18 ఏళ్లు, ఆపై వయసు కలిగిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభానికి ముందు ఈ నెల 9 నుంచి అక్టోబర్‌ 31 వరకు సన్నాహక కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. డూప్లికేట్‌ ఓటర్లు, పునరావృతమైన ఓట్లు, ఇతర తప్పులను తొలగించడం, బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి ఓటర్ల పరిశీలన నిర్వహించడం, పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ వంటి కార్యక్రమాలను ఇందులో భాగంగా చేపట్టనున్నారు.

అనంతరం నవంబర్‌ 1 నుంచి కింద పేర్కొన్న షెడ్యూల్‌ ప్రకారం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, ఇతర మార్పుచేర్పుల కోసం  ఠీఠీఠీ.nఠిటp. జీn పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) శశాంక్‌ గోయల్‌ గురువారం ఓ ప్రకటనలో కోరారు. 

మరిన్ని వార్తలు