ధాన్యం కొనుగోలు.. రెండ్రోజుల్లో ప్రకటన: కేంద్ర మంత్రి

23 Nov, 2021 21:35 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: వరి ధాన్యం కొనుగోలుపై ఇంకా స్పష్టత రాలేదు. సుమారు గంట 23 నిమిషాలపాటు సాగిన భేటీ ఎటూ తేల్చలేదు. మంగళవారం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ సరఫరా శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రి కేటీఆర్ బృందం భేటీ ముగిసింది. ఖరీఫ్, యాసంగి సీజన్లలో 150 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని కేటీఆర్ బృందం వినతిపత్రం ఇచ్చింది. కొంతమేర అధికంగా కొనుగోలు చేసేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇక సమావేశం మధ్యలోనే ధాన్యం పంట విస్తీర్ణంపై వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో కేంద్రమంత్రి గోయల్‌ సంభాషించారు.

రెండు రోజుల తర్వాత నిర్దిష్టంగా ఎంత కొనుగోలు చేసే అంశాన్ని చెబుతామని కేంద్రం తెలిపింది. 26వ తేదీన మరోసారి కలవాలని కేంద్ర మంత్రి కోరారు. ఉప్పుడు బియ్యం కొనమని కేంద్ర ప్రకటన చేయాలని తెలంగాణ బృందం విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాత తామే రైతులను ఒప్పిస్తామని తెలంగాణ మంత్రులు వెల్లడించారు. భేటీ అనంతరం తెలంగాణ మంత్రుల బృందాన్ని వెంటబెట్టుకొని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో కేంద్ర మంత్రి గోయల్ కలిపించారు.

మరిన్ని వార్తలు