Bharat Bandh భారత్‌ బంద్‌ను జయప్రదం చేయండి

25 Sep, 2021 04:30 IST|Sakshi
శుక్రవారం ఎంబీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.  చిత్రంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం తదితరులు  

ప్రజలకు సీపీఐ, సీపీఎం సహా పలు ప్రతిపక్ష పార్టీల విజ్ఞప్తి 

రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం రద్దు చేయాలని డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 27న జరగబోయే భారత్‌ బంద్‌కు ప్రతిపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బంద్‌ను జయప్రదం చేయాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయా పార్టీల నేతలు, రైతు సంఘాల నాయకులు శుక్రవారం ఎంబీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్‌ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ

ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, కోవిడ్‌ సమస్యలను పరిష్కరించడంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వం సాగుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు.
చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన

అనంతరం కాంగ్రెస్‌ నేత మల్లు రవి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకుడు అచ్యుత రామారావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు డీజీ నర్సింహారావు, బెల్లయ్యనాయక్, బాలమల్లేశ్, కె.రమ, బక్క నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు