1,076 కి.మీ జాతీయ రహదారులు 24,000కోట్లు

2 Jan, 2021 03:38 IST|Sakshi

రాష్ట్రంలో భారీగా 4 వరుసల రోడ్లు నిర్మించనున్న కేంద్రం

మరో రూ.3వేల కోట్లతో 346 కి.మీ. రోడ్ల విస్తరణ

ఈ ఆర్థిక సంవత్సరంలోనే చేపట్టేలా ప్రణాళిక

భూసేకరణ వేగంగా జరపాలి అంటూ రాష్ట్రానికి సూచన  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో తొలిసారి భారీ ఎత్తున నాలుగు వరుసల రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. భారత్‌ మాల ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలో ఒకేసారి రూ. 24 వేల కోట్లతో ఏకంగా 1,076 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల జాతీయ రహదా రులను నిర్మించ నుంది. ఈ రోడ్ల నిర్మాణ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే చేపట్టేం దుకు ప్రణాళిక రచిస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే రెండేళ్లలోనే ఈ పనులు పూర్తికానున్నాయి.

పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేసేందుకు...
దేశవ్యాప్తంగా రోడ్‌ నెట్‌వర్క్‌ను పెంచడం ద్వారా పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేయాలని కేంద్ర ప్రభుత్వం భావి స్తోంది. చాలా ప్రాంతాల్లో పరి శ్రమలు ఏర్పాటు కావటానికి మౌలికవసతుల కొరతే అడ్డం కిగా మారింది. మంచి రోడ్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటైతే కొత్త ప్రాంతాల్లోనూ భారీగా పెట్టుబ డులు పెట్టేందుకు సంస్థలు ముందు కొస్తాయి. ఈ నేపథ్యంలో భారత్‌ మాలా ప్రాజెక్టు కింద భారీగా రోడ్ల అభివృద్ధికి కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో రూ. 27 వేల కోట్ల మేర రోడ్ల అభివృద్ధికి ఖర్చు చేసేందుకు సమాయత్తమవు తోంది. ఇందులో రూ. 24 వేల కోట్లతో నాలుగు వరుసల రోడ్లను నిర్మించనుండగా మరో రూ. 3 వేల కోట్లతో జాతీయ రహదారులను వెడల్పు చేయనుంది.  చదవండి: (బీజేపీలో చేరతా : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి)

భూసేకరణ వేగంగా జరిగితే..
రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని కేంద్రం సూచించింది. అందుకయ్యే వ్యయాన్ని కేంద్రమే భరించనుంది. కావాల్సిన భూము లను సేకరించి కేంద్రానికి కేటాయిస్తే వెంటనే రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తాజాగా తేల్చిచెప్పారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు