పెగాసిస్‌ను ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధం 

26 Jul, 2021 15:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం పెగాసిస్‌ స్పెయిన్‌ను ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధమని ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్‌ అన్నారు. ప్రతిపక్షాలను, ఉద్యమకారులపై అక్రమంగా కేసు పెట్టడానికి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి పెగాసిస్‌ పెయిన్‌ను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. బాగ్‌లింగంపల్లిలోని ఓంకార్‌భవన్‌లో ఎంసీపీఐ(యూ) కేంద్ర కమిటీ ముగింపు సమావేశాలు ఆదివారం జరిగాయి. ఈ సందర్భంగా మద్దికాయల అశోక్‌ను పార్టీ పూర్తికాలం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్త ఉద్యమాలు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాటం నాగభూషణం, సభ్యులు తాండ్ర కుమార్, మహేంద్ర, అనుభవ్‌దాస్‌ శాస్త్రి, రాజాదాస్‌తోపాటు 11 రాష్ట్రాలకు చెందిన కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు