రైతుబంధు పథకంపై కేంద్రం ప్రశంసలు

27 Aug, 2020 16:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో అమలవుతున్న పథకాలపై కేంద్రప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. రైతుబంధు, రైతు సమన్వయ సమితిల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అభినందించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెస్తున్న అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ ఫండ్ స్కీమ్ పై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు కోరారు. (మహిళా ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన బామ్మ)

కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ దేశంలో వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిణామాలపై ఈ సందర్భంగా మాట్లాడారు. ఆయనిచ్చిన ప్రెజెంటేషన్‌లో తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతు బంధు సమితిల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రైతుబంధు పథకం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పడంతో పాటు, తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో విజయవంతంగా అమలు చేస్తున్నారని ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తరపున వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. (డీప్‌ కోమాలోకి ప్రణబ్‌ ముఖర్జీ)

మరిన్ని వార్తలు